తలసేమియ బాధితులకు అండగా బాలయ్య!

107
nbk

తలసేమియా బాధితులకు అండగా నిలిచేందుకు మరో ముందడుగు వేశారు నందమూరి బాలకృష్ణ. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా, తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారంతో నిర్వహిస్తున్న మెగా రక్త దాన శిబిరం ఏర్పాటుచేయాలని పిలుపునిచ్చారు బాలయ్య.

ఈ సందర్భంగా బాలయ్య తలసేమియా వ్యాధి గురించి వివరిస్తూ, రక్త దానం పట్ల ప్రచారంలో ఉన్న పలు అపోహలను తొలగించారు. ఎంత అభివృద్ధి చెందినా రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయడం సాధ్యం కాదని తోటివారి ప్రాణాలను కాపాడటానికి రక్తదానమే ఆయుధమన్నారు. భారీ సంఖ్యలో టీడీపీ అభిమానులు,తన ఫ్యాన్స్‌ రక్తదాని చేయాలన్నారు.