ప్రధాని మోదీ బర్త్ డే….సీఎం కేసీఆర్ విషెస్‌

203
modi

ప్రధానమంత్రి నరేంద్రమోదీ 70వ బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తెలంగాణ ప్రభుత్వం, ప్రజల తరపున సీఎం కేసీఆర్ …ప్రధానమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి మోదీ మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు. దేశానికి ప్ర‌ధాని మోదీ గొప్ప సంప‌ద‌గా అభివర్ణించారు గ‌వ‌ర్న‌ర్ తమిళిసై.

ప‌్ర‌ధాని మోదీకి కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు రాహుల్ గాంధీ, ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ భార‌త ప్ర‌ధానికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న స్పందిస్తూ.. పీఎం మోదీతో నిర్మాణాత్మ‌క సంభాణ‌ను కొన‌సాగించేందుకు ఎదురు చూస్తున్న‌ట్లు చెప్పారు. ద్వైపాక్షిక, అంతర్జాతీయ ఎజెండాపై కలిసి పనిచేయడానికి తాను ఎదురుచూస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

మోదీ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా భార‌తీయ జ‌న‌తా పార్టీ నాయ‌కులు దేశ వ్యాప్తంగా ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు.