భట్టి సవాల్‌ను స్వీకరించిన మంత్రి తలసాని..

273
ktr

కాంగ్రెస్ ఎమ్మెల్యే భ‌ట్టి విక్ర‌మార్క స‌వాల్‌ను స్వీకరించారు మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్. శాసనసభలో భట్టి విక్రమార్క నగరంలో లక్ష డబుల్ బెడ్‌ రూమ్‌ ఇండ్లు ఎక్కడ కట్టారో తెలపాలని కోరగా పూర్తి వివరాలు ఇస్తామని తెలిపిన తలసాని ఇవాళ ఉదయం బంజారాహిల్స్‌లోని భట్టి విక్రమార్క నివాసానికి వెళ్లారు. అనంతరం భట్టి విక్ర‌మార్క‌ను తీసుకుని జియ‌గూడ‌లోని డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల ప‌రిశీల‌న‌కు వెళ్లారు.

ఈ ఏడాది చివరికల్లా ప్రభుత్వం నగరంలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన పేదలకు ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. గత ఆరేండ్లలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.67,135 కోట్లను క్యాపిటల్‌ ఎక్స్‌పెండిచర్‌గా వివిధ రూపాల్లో ఖర్చు చేసిందని, రెవెన్యూ ఎక్స్‌పెండిచర్‌ కూడా కలిపితే రూ.లక్ష కోట్లు దాటుతుందని కేటీఆర్ సభలో వెల్లడించారు.