యాదాద్రి పుణ్యక్షేత్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం మధ్యాహ్నం చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కేసీఆర్ యాదాద్రికి వెళ్లారు. ముందుగా యాదాద్రిలో శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం పూర్తికావస్తున్న పుణ్యక్షేత్రం పునర్నిర్మాణ పనులను పరిశీలిస్తారు. ఆలయ పునఃప్రారంభ ముహూర్తాన్ని ఈ సందర్భంగా సీఎం ప్రకటిస్తారు. ఆలయ పునఃప్రారంభ ముహూర్తాన్ని ఇప్పటికే చినజీయర్‌స్వామి ఖరారు చేశారు. ఆ వివరాలను మధ్యాహ్నం 3:30 గంటలకు మీడియాకు సీఎం తెలియజేస్తారు.
సీఎం కేసీఆర్ వెంట మంత్రులు జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి,మల్లారెడ్డి,విప్ ,ఆలేరు mla గొంగిడి సునీత,మోత్కుపల్లి నరసింహులు,గుత్తా సుఖేందర్ రెడ్డి,,..OSD దేశపతి,,.Mla లు శేఖర్ రెడ్డి.. మర్రి జనార్దన్ రెడ్డి… mlc కృష్ణా రెడ్డి..CM O భూపాల్ రెడ్డి…కలెక్టర్ పమేలా సత్పతి తదితరులు ఉన్నారు.