హుజురాబాద్‌లో కేసీఆర్ బహిరంగ సభ.. ఈటలకు టెన్షన్‌..!

96
- Advertisement -

హుజురాబాద్‌ ఉప ఎన్నికల వేళ బీజేపీ నేతల గుండెల్లో బాంబు పేల్చే వార్త ఇది…మరి కొద్ది రోజుల్లో ఉప ఎన్నికలకు పోలింగ్ దగ్గరపడుతుండడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మురం చేశాయి. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. కాగా మొదట్లో సానుభూతితో ఈటల రాజేందర్‌కు కాస్త ఎడ్జ్ ఉందని ప్రచారం జరిగింది. కానీ హుజురాబాద్‌లో దళితబంధు ప్రారంభోత్సవ సభతో సీఎం కేసీఆర్ ఒంటి చేత్తో రాజకీయాన్ని మార్చివేశారు. అప్పటి వరకు ఈటల రాజేందర్ పై చేయి సాధించగా..సీఎం కేసీఆర్ సభ తర్వాత రాజకీయ సమీకరణాలు టీఆర్ఎస్‌‌‌కు అనుకూలంగా మారాయి. తాజాగా హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారం క్లైమాక్స్‌కు చేరుకుంటున్న వేళ సీఎం కేసీఆర్ మరోసారి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ నెల 26 లేదా 27 తేదీల్లో హుజూరాబాద్‌ నియోజకవర్గంలో నిర్వహించే భారీ బహిరంగసభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు.

తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో గులాబీ బాస్ హుజురాబాద్ ఉప ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఉప ఎన్నికల్లో వందకు వందశాతం టీఆర్‌ఎస్‌ పార్టీయే గెలుస్తుందని, అందులో డౌటే లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికే అనేక సర్వేలు టీఆర్‌ఎస్‌ పార్టీకి అనుకూలంగా ఉన్నట్టు తేల్చిచెప్తున్నాయని వెల్లడించారు. అన్ని సర్వేల్లోనూ టీఆర్‌ఎస్‌కు గెలుపు అవకాశాలు 13 శాతం ఎక్కువగా ఉన్నాయని తేలినట్టు చెప్పారు. ఎవరెన్ని చెప్పినా అక్కడ ఎగిరేది గులాబీ జెండాయేనని ధీమా వ్యక్తంచేశారు. పరిస్థితులను బట్టి అవసరమైతే ఈ నెల 26 లేదా 27 తేదీల్లో హుజూరాబాద్‌ నియోజకవర్గంతో బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. మొత్తంగా ఎన్నికలకు రెండు, మూడు రోజుల ముందు సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ‌లో పాల్గొంటే అప్పటి వరకు ఉన్న పొలిటికల్ సీన్ అంతా ఒక్కసారిగా టర్న్ అయిపోతుంది.

సాగర్ ఉప ఎన్నికల్లో కూడా ఇలాగే మొదట ఒకసారి, ఎన్నికల ముందు మరో భారీ బహిరంగ సభ నిర్వహించి సీఎం కేసీఆర్ ఒంటి చేత్తో టీఆర్ఎస్‌ అభ్యర్థి నోముల భగత్‌ను గెలిపించారు. ఇప్పుడు అదే తరహాలో సరిగ్గా ఎన్నికలకు మూడు రోజుల ముందు హుజురాబాద్‌కు కేసీఆర్ వస్తున్నట్లు ప్రకటించడంతో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కేసీఆర్ స్టైల్ ఏంటో ఈటలకు బాగా తెలుసు…తూటాల్లాంటి డైలాగులతో, వాస్తవాలను ప్రజలకు వివరిస్తూ, ప్రతిపక్షాల కుట్రలను బయటపెడుతూ… తనదైన శైలిలో ప్రజల మైండ్ సెట్‌ను పూర్తిగా మార్చేస్తారు. మొత్తంగా గులాబీ బాస్ కేసీఆర్ ఈ నెల 26, 27 వ తేదీల్లో భారీ బహిరంగసభ నిమిత్తం హుజురాబాద్‌కు వస్తున్నట్లు ప్రకటించడంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో కదనోత్సాహం నెలకొంది. మరోవైపు కేసీఆర్ ఎంట్రీతో కాషాయ నేతల్లో టెన్షన్ మొదలైంది. కేసీఆర్ సభ తర్వాత ఓటర్లు పూర్తిగా టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లువైపు మొగ్గు చూపుతారని, ఈటల ఓటమి ఖాయమని హుజురాబాద్‌‌లో చర్చ జరుగుతోంది.

- Advertisement -