వ‌ర్మపై మంచు మ‌నోజ్‌ పంచ్‌..

129
- Advertisement -

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఎపుడు ఎవరినీ ఏ రకంగా ఎలా గిల్లుతాడో ఆయనకే తెలియదు. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక విషయం పై వ్యంగ్యంగా స్పందించడం అయన అలవాటు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ట్రెండింగ్‌లో నిలుస్తుంటాడు ఆర్జీవీ. తాజాగా ఆయన మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) వివాదంపై తనదైన స్టైల్లో స్పందించాడు.

మొత్తం జోక‌ర్ల‌తో సిని’మా’ స‌ర్క‌స్ నిండిపోయింద‌ని ఆయ‌న ట్వీట్ చేశారు. అయితే దీనిపై ‘మా’ కొత్త అధ్య‌క్షుడు మంచు విష్ణు సోద‌రుడు, హీరో మంచు మ‌నోజ్‌ స్పందించాడు. ‘మీరు అందులో రింగ్ మాస్ట‌ర్ స‌ర్’ అంటూ ఎద్దేవా చేశాడు. దీంతో ‘సరైన పంచ్ ఇచ్చావ్.. అన్నా..’ అంటూ మంచు మ‌నోజ్‌ పై అభిమానులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

- Advertisement -