వాసాలమర్రికి సీఎం కేసీఆర్

47
kcr cm

సీఎం కేసీఆర్ మరోసారి యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి గ్రామంలో పర్యటించనున్నారు. రేపు(బుధవారం) వాసాలమర్రి గ్రామాన్ని సందర్శించనున్నారు. గ్రామంలోని దళితవాడలో పర్యటించడంతోపాటు రైతువేదికలో 130 మందితో సమావేశం కానున్నారు. గ్రామానికి సీఎం కేసీఆర్‌ రానున్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నం కాగా గ్రామంలో సందడి వాతావరణం నెలకొన్నది.

ఇటీవల వాసాలమర్రిలో గ్రామస్తులతో సహపంక్తి భోజనం చేసిన సీఎం కేసీఆర్.. ఆ తర్వాత గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా మరో 20సార్లు అయినా వాసాలమర్రికి వస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం బుధవారం వాసాలమర్రిలో పర్యటించనున్నారు సీఎం కేసీఆర్