ఖమ్మంలో మంత్రి పువ్వాడ సైకిల్ సవారీ..

48
khammam

ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఖమ్మం పట్టణంలో సైకిల్‌పై పర్యటించారు మంత్రి పువ్వాడ అజయ్‌. మేయర్‌ పునుకొల్లు నీరజ, కలెక్టర్‌ వీపీ గౌతమ్‌, కమిషనర్‌ అనురాగ్‌ జయంతితో కలిసి సైకిల్‌పై తిరుగుతూ క్షేత్రస్థాయిలో పనుల ప్రగతిని పరిశీలించారు.

మున్సిపల్ కార్పొరేషన్ రోడ్, కాస్బా బజార్, పాకబండ బజార్, బోనకల్ రోడ్, చర్చ్ కాంపౌండ్, శ్రీనివాస్ నగర్, ప్రకాశ్‌నగర్, మార్కెట్ రోడ్, సుందరయ్య నగర్, పంపింగ్ వెల్ రోడ్, ఐటీహబ్ సెంటర్, మమత సర్కిల్, వరదయ్య నగర్, లకారం సర్కిల్‌లో మంత్రి పర్యటించారు. అనంతరం లకారం ట్యాంక్ బండ్ వద్ద మొక్కలు నాటారు.ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడారు. మిషన్ భగీరథ, రోడ్లు, వీధి దీపాలు, పైప్‌లైన్ పనులు, రోడ్డు విస్తరణ తదితర పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న అన్ని పనుల సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.