క్రిస్మస్ ట్రీట్…పుష్ప రిలీజ్ డేట్ ఫిక్స్

91
pushpa release date

అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం షూటింగ్ తిరిగి ప్రారంభం కాగా రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తున్న వారికి మేకర్స్ గుడ్ న్యూస్ అందించారు.

రెండు పార్టులుగా సినిమా తెరకెక్కుతుండగా ఫస్ట్ పార్ట్‌ని క్రిస్మస్‌ కానుకగా డిసెంబ‌ర్‌లో విడుద‌ల చేయ‌నున్న‌ట్టు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ని రిలీజ్‌ చేశారు. ఐదు భాష‌ల‌లో ఈ చిత్రం విడుద‌ల కానుండ‌గా, ఇందులో బ‌న్నీ పుష్ప‌రాజ్ పాత్ర‌లో క‌నిపించి సంద‌డి చేయ‌నున్నారు.

పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన్నా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సినిమా సాగుతుందని తెలుస్తుంది. ఇక దేవిశ్రీ ప్ర‌సాద్ కంపోజ్ చేసిన సింగిల్ ట్యూన్ ఆగ‌స్ట్ 13న విడుద‌ల కానుంది.