నేడు కంచికి సీఎం కేసీఆర్..

452
cm kcr kanchi
- Advertisement -

సీఎం కేసీఆర్ నేడు తమిళనాడులోని కాంచీపురానికి వెళ్లనున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ఇవాళ ఉదయం తమిళనాడుకు వెళ్లనున్నారు. కంచిలోని అతివరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నట్టు తెలిసింది.

40 ఏళ్లకోసారి 40 రోజులపాటు దర్శనభాగ్యం కలిగించే అత్తి వరదరాజ పెరుమాళ్‌ను సందర్శించుకుని తర్వాత కంచి వెళ్తారని సమాచారం. బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంటకు చేరుకుంటారు. అక్కడి నుంచి కంచికి రోడ్డుమార్గంలో వెళ్లనున్నారు.సాయంత్రం తిరిగి హైదరాబాద్‌కు చేరుకోనున్నట్టు సమాచారం.

- Advertisement -