ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం పర్యటనలో భాగంగా లక్ష్మీ బ్యారేజ్ మీద నుంచి నాణాలు వదిలి మొక్కులు చెల్లించుకున్నారు. వ్యూ పాయింట్ వద్ద ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు సీఎం కేసీఆర్. రాబోయే వర్షాకాలం వరద నీరు ఉదృతంగా చేరు తుందని, ఈ నేపధ్యంలో లక్ష్మి బ్యారేజ్ నుంచి ఎప్పటికప్పుడు నీటిని తోడు కోవాలని, అందుకు సంబంధించిన వ్యవస్థను సిద్ధం చేసుకోవాలని ఈఎన్‌సీ లు మురళీధర్ రావు, నల్ల వెంకటేశ్వర్లు,ఓఎస్‌డీ శ్రీధర్ దేశ్‌పాండే సహా అక్కడ హాజరైన పలువురు ఇంజనీర్లకు ఉన్నతాధికారులకు సూచించారు.
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా పనిచేసి ఇటీవల ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా నూతన బాధ్యతలు స్వీకరించిన రజత్ కుమార్‌కు సంభందిత విషయాల పట్ల అవగాహన పెరిగే విధంగా ప్రాజెక్టు నిర్మాణము సాగునీటి వినియోగం ప్రభుత్వ ప్రాధాన్యతలను సీఎం వివరించారు. ఎంతో కష్టపడి కట్టుకున్న ప్రాజెక్టులలోని నీటిని ఎప్పటిక్పుడు తోడి పోసుకుంటూ రిజర్వాయర్ లను నింపుతూ… గోదావరి జలాలు వృథా పోకుండా చుస్కోవల్సిన బాధ్యత ఇంజనీర్ లదే నన్నారు.
ఎస్సారెస్పీ నుంచి మొదలుకుని మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజిలను రిజర్వాయర్ లను ఎత్తిపోతల పంపులను కాల్వలను చివరాఖరికి ఆయకట్టు దాకా సాగునీరు వ్యవసాయ భూములను తడిపే చివరి జల ప్రయానం దాకా సునిశిత పర్యవేక్షణ చేసుకోవాలన్నారు. ఎక్కడికక్కడ పని విభజన చేసుకుని పూర్తిస్థాయిలో ఇంజినీరింగ్ వ్యవస్థను పటిష్ట పరుచుకుని అవసరమైతే పోలీసుల మాదిరి వైర్‌లెస్ వాకీ టాకీల వ్యవస్థను ఏర్పాటు చేసుకొని పని చేయాలని సీఎం అధికారులకు చెప్పారు.
సమాచారాన్ని ప్రతిక్షణం చెరవేసుకుంటూ ఎప్పుడు ఏ మోటార్ నడుస్తుంది ఏ పంపు పోస్తుంది… ఎన్నినీల్లు ఎత్తాలే ఎప్పుడు ఆపాలే ఎప్పుడు నీటిని కిందికి వదులలే వంటి పలు విధాలైన నీటి పంపిణీ సాంకేతిక అంశాల పట్ల కాళేశ్వరం టీం మొత్తానికి అవగాహన ఉండాలి అన్నారు. అట్లా సమన్వయంతో పనిచేసి గోదావరి జలాలను నూటికి నూరుశాతం సద్వినియోగ పరుచు కొగలమని సీఎం స్పష్టం చేశారు. అందుకు సంబంధించి చర్యలు చేపట్ట నున్నట్టు వివరించిన సీఎం మెదిగడ్డ వద్ద మధ్యాహ్నం భోజనం చేసి కరీంనగర్ బయలు దేరారు.