కొల్హాపూర్‌ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్‌..

108
- Advertisement -

అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన కొల్హాపూర్‌ లోని శ్రీ అంబాబాయి మహాలక్ష్మీ అమ్మవారి దర్శనార్ధం ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గురువారం ఉదయం మహారాష్ట్రలోని కొల్హాపూర్ బయలుదేరి వెళ్లారు. హైదరాబాద్ నుంచి కుటుంబ సమేతంగా విమానంలో కొల్హాపూర్ చేరుకున్న సీఎం కేసీఆర్, మధ్యాహ్నం కొల్హాపూర్ లోని శ్రీ అంబాబాయి మహాలక్ష్మీ ఆలయానికి చేరుకోగా, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయంలో కార్వీర్ నివాసిని శ్రీ అంబాబాయి మహాలక్ష్మి అలంకార పూజలో సీఎం కేసీఆర్, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మహాలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

సీఎం కేసీఆర్ దంపతులతో పాటు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్ కుమార్, తదితరులు ఉన్నారు.

- Advertisement -