CMKCR:జై తెలంగాణ.. జైజై తెలంగాణ

55
- Advertisement -

అమరుల త్యాగాలను నిత్యం స్మరించుకునేవిధంగా తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన అమరుల స్థూపంను సీఎం కేసీఆర్‌ గురువారం సాయంత్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటగా పోలీసులు అమరవీరులకు గన్‌ సెల్యూట్‌ నిర్వహించారు. ఆ తర్వాత అమరవీరులకు సీఎం కేసీఆర్‌ మంత్రులు ఇతర ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు.

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేసి, అమర జ్యోతిని సీఎం ప్రారంభించారు. అనంత‌రం అమ‌ర‌వీరుల‌పై ప్ర‌ద‌ర్శించిన ప్ర‌ద‌ర్శ‌న‌ను సీఎం కేసీఆర్, ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు తిల‌కించారు. ఉద్యమ ప్రస్థానాన్ని వివరించే ఫోటో గ్యాలరీ ఉద్యమ చరిత్రకు సంబంధించిన గ్రంథాలయంను పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేశారు. సభావేదికపైకి సీఎం కేసీఆర్‌ చేరుకోనున్నారు. అమరులకు నివాళిగా గేయాలను ఆలపించనున్నారు.

అనంతరం 10వేల మంది క్యాండిల్‌ లైట్స్‌ ప్రదర్శిస్తూ అమరులకు నివాళులర్పించనున్నారు. అనంతరం సీఎం కేసీఆర్‌ ప్రసంగించ‌నున్నారు. ఎంపికచేసిన ఆరుగురు అమరుల కుటుంబాలను సన్మానిస్తారు. అలాగే, లేజర్‌, 800 డ్రోన్లతో షో నిర్వహించనున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వివిధా కార్పొరేష‌న్ల చైర్మ‌న్లు, జిల్లా పరిష‌త్ చైర్మ‌న్లు, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు, మేధావులు, క‌వులు, క‌ళాకారులు, ర‌చ‌యిత‌లు భారీ సంఖ్య‌లో పాల్గొన్నారు.

Also Read: KTR:ప్రజలకు అండగా బీఆర్ఎస్‌

మూడున్న‌ర ఎక‌రాల‌ సువిశాల విస్తీర్ణంలో 150 అడుగుల ఎత్తులో అమ‌రుల స్మార‌కం ఏర్పాటు చేశారు. రూ. 178 కోట్ల వ్య‌యంతో పూర్తిగా స్టెయిన్ లెస్ స్టీల్‌తో ప్ర‌మిద‌, దీపం ఆకృతిలో స్మార‌కాన్ని నిర్మించారు. ప్ర‌జ్వ‌ల‌న దీపం న‌మూనాను క‌ళాకారుడు ర‌మ‌ణారెడ్డి రూపొందించారు. మొద‌టి రెండు బేస్‌మెంట్ల‌లో 2.14 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగుల్లో పార్కింగ్ సదుపాయం కలదు. గ్రౌండ్ ఫ్లోర్‌లో ప్ర‌ద‌ర్శ‌న‌ల కోసం స్థలం కేటాయించారు. మొద‌టి అంత‌స్తులో అమ‌రుల ఫోటో గ్యాల‌రీ, మినీ థియేట‌ర్ ఏర్పాటు చేశారు. రెండో అంత‌స్తులో 500 మంది కూర్చునేలా క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ ఏర్పాటు చేశారు. మూడో అంత‌స్తులో చుట్టూ అద్దాల‌తో అద్దాల పైక‌ప్పు నిర్మించారు.

Also Read: శంకరమ్మకు సముచిత పదవి!

- Advertisement -