మహేష్ తో హాలీవుడ్ నటుడు ?

35
- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్ బాబుతో దర్శక ధీరుడు రాజమౌళి తీయబోతున్న మూవీ గురించి ఎప్పటికప్పుడు క్రేజీ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా మరో ఊహించని గాసిప్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో హాలీవుడ్ స్టార్ హీరోయిన్ నినా డోబ్రేవ్ కనిపించనుంది ఆ రూమర్స్ సారాంశం. అలాగే హాలీవుడ్ స్టార్ నటుడు క్రిస్ హెమ్స్ వర్త్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడట. మొత్తానికి జక్కన్న సినిమా పై రోజుకొక రూమర్ వైరల్ అవుతుంది. మరి నిజంగానే మహేష్ సినిమాలో నినా డోబ్రేవ్ నటిస్తే.. పాన్ వరల్డ్ సినిమా అయినట్టే. ఈ సినిమాపై ఇప్పటికే పలు అంచనాలు ఉండగా.. తాజాగా ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ మూవీగా తీర్చిదిద్దేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు. ఇందుకోసం ఇంగ్లీష్‌లో కూడా తెరకెక్కించనున్నాడు. దీంతో హాలీవుడ్ టెక్నీషియన్లు పని చేయనున్నారనే టాక్ కొనసాగుతోంది.

Also Read: ఓటీటీ : ఏ కంటెంట్ ఎందులో ?

ఇప్పటికే ఈ చిత్రంలో మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె ను రాజమౌళి సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. ఐతే, మరో హీరోయిన్ రోల్ కోసం గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాను కూడా జక్కన్న అప్రోచ్ అవుతున్నారు. ఈ క్రమంలోనే హాలీవుడ్ స్టార్ నటుడు క్రిస్ హెమ్స్ వర్త్ ని ఈ సినిమాలో విలన్ గా నటించడానికి రాజమౌళి ఒప్పించినట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. క్రిస్ హెమ్స్ వర్త్ క్యారెక్టర్ చాలా విభిన్నంగా ఉండటంతో ఆయన కూడా, మహేష్ కి విలన్ గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. మొత్తానికి మహేష్ కోసం రాజమౌళి భారీగానే ప్లాన్ చేస్తున్నాడు. మరి జక్కన్న ఏ రేంజ్ లో మహేష్ కి హిట్ ఇస్తాడో చూడాలి.

Also Read: జూన్‌ 24..భోళా శంకర్‌ టీజర్‌ రిలీజ్‌

- Advertisement -