కేసీఆర్ వేటు వేయనున్న మంత్రులు.వీళ్లేనా.????

316
cm kcr
- Advertisement -

లోక్ సభ ఎన్నికల ఫలితాలపై సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీ నుండి గెలిచిన ఎంపీలు సీఎం కేసీఆర్‌ని కలిశారు. ఈ సందర్భంగా వారిని అభినందిస్తూనే ఓటమికి గల కారణాలను అన్వేషించాలని సూచించారు సీఎం. మొత్తం 16 స్థానాలను ఆశించాం. ఇందులో తొమ్మిది దక్కాయి. విజయాలు సంతృప్తికరమే కానీ, ఏడు స్థానాల్లో ఓటమి ఎదురైంది. ఎంపీలుగా అభిప్రాయాలను తెలపాలని సూచించిన సీఎం … పార్టీ బలోపేతంలో భాగస్వాములుకావాలని హితబోధ చేశారు.

ఇక ఓటమికి బాధ్యులను చేస్తూ పలువురు మంత్రులను తొలగించనున్నట్లు రాజకీయవర్గాల్లో జోరుగా చర్చనడుస్తోంది. ఇద్దరు మంత్రులపై వేటు వేసే దిశగా కేసీఆర్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓటమి బాట పట్టిన వారిలో తన కూతురు కల్వకుంట్ల కవితతో పాటు సన్నిహితుడు వినోద్ కుమార్ ఉండటంతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారట. ఓటమికి గల కారణాలను వివరించడానికి ప్రగతి భవన్ కు వచ్చిన మంత్రులను కలవడానికి కూడా ఇష్టపడలేదట కేసీఆర్.

కాంగ్రెస్‌కు పట్టున్న నల్గొండ జిల్లాలో రెండు పార్లమెంటు సీట్లను గెలిపించే బాధ్యతను మంత్రి జగదీశ్ రెడ్డికి అప్పగించారు సీఎం. కానీ ఇక్కడ ఫలితం టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా వచ్చింది. అసెంబ్లీలో మెజార్టీ స్ధానాలు దక్కించుకున్న రెండు పార్లమెంట్ స్థానాలను కొల్పోయింది. దీంతో పాటు మల్కాజిగిరి టికెట్ ను మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డికి, సికింద్రాబాదు సీటును తలసాని శ్రీనివాస యాదవ్ కుమారుడు సాయి కిరణ్ యాదవ్ కు ఇచ్చారు. వీరిద్దరు ఈ సీట్లలో టీఆర్ఎస్‌ను గెలిపించే బాధ్యత తమదేనని సీఎంకు భరోసా ఇచ్చారట. కానీ ఈ రెండు స్ధానాల్లో టీఆర్ఎస్ ఓటమిబాట పట్టడంతో ఓటమికి గల కారణాలను విశ్లేషించాలని వారికి సూచించారట. మొత్తంగా ఈ ముగ్గురిలో ఇద్దరికి వేటు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. అయితే టీఆర్ఎస్ నేతలు మాత్రం అవన్ని పుకార్లేనని కొట్టిపారేస్తున్నారు.

- Advertisement -