ఎంపీల ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు పూర్తి

233
ls modi
- Advertisement -

17వ లోక్ సభ ఏర్పాటుకు సన్నాహాలు మొదలయ్యాయని..ఎంపీల ప్రమాణస్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తిచేశామని లోక్ సభ సెక్రటరీ జనరల్ స్నేహలత శ్రీ వాస్తవ తెలిపారు. కొత్త ఎంపీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఇందుకోసం 56 మంది నోడల్ ఆఫీసర్లను నియమించామని..వీరంతా కొత్తగా ఎంపికైన ఎంపీలతో టచ్‌లో ఉంటారని చెప్పారు.

కొత్తగా ఎన్నికైన సభ్యులు రిజిస్ట్రేషన్‌ ఫామ్స్, ఎన్నిక దృవీకరణ పత్రాలు తీసుకురావాలన్నారు. పార్ట్ 1ను ఆన్‌లైన్‌లో నింపే అవకాశం ఇచ్చామని పార్ట్‌ 2లోని వివరాలను రెండు మూడు రోజుల తర్వాతైన ఇవ్వొచ్చన్నారు.

ఏ భాషలో ప్రమాణస్వీకారం చేస్తారనే దానిపై ముందుగానే ఎంపీలు సమాచారమివ్వాలని సూచించారు. ఎయిర్‌పోర్టు టర్మినల్‌లో ఎంపీలకు స్వాగత డెస్క్‌లు ఏర్పాటు చేశామన్నారు. ఎంపీలకు సెక్యూరిటీ ఫీచర్స్‌,ఐడెంటిటి కార్డులతో పాటు పోలీసు భద్రతను కూడా కల్పిస్తున్నామని చెప్పారు.

పార్లమెంట్ మాన్యువల్‌కు సంబంధించిన పుస్తకాలు,రాజ్యాంగం పుసక్తాలను అందించడంతో పాటు పెన్ డ్రైవ్ ఇస్తున్నామని తెలిపారు. ఎంపీలకు స్టేట్ గెస్ట్ హౌస్‌లు,వెస్ట్రన్‌ హౌస్‌లలో వసతులు కల్పించామన్నారు. ఈ గదుల్లో తాత్కాలిక వసతి సదుపాయం కల్పిస్తామని 24 గంటలు సేవలందించే డెస్క్ ఏర్పాటుచేశామని చెప్పారు. పేపర్ వర్క్ తగ్గించి డిజిటల్ ద్వారా సేవలు అందించే ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.

- Advertisement -