13న యాదాద్రికి సీఎం కేసీఆర్‌..

165
kcr

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆదివారం యాదద్రిని సందర్శించనున్నారు. ఈ నెల 13న ఉదయం యాదాద్రి భువనగిరి జిల్లాకు బయల్దేరనున్న కేసీఆర్ యాదగిరి గుట్టలో పర్యటించునున్నారు. గుట్ట ఆలయ అభివృద్ధి పనులను సీఎం పరిశీలించనున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ ఓ ప్రకటనలో తెలిపారు.

ఈనెల 13న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టను దర్శనం చేసుకుని అనంతరం యాదగిరిగుట్టలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, యాదగిరిగుట్టలో జరుగుతున్న పనులను పరిశీలిస్తారని జిల్లా కలెక్టర్ తెలిపారు.