సీఎం కేసీఆర్ సోమవారం సూర్యాపేటకు రానున్నారని తెలిపారు మంత్రి జగదీష్ రెడ్డి.సూర్యాపేట లో కల్నల్ సంతోష్ బాబు నివాసంలో వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు మంత్రి జగదీష్ రెడ్డి దంపతులు.ఈ సందర్భంగా మాట్లాడిన జగదీష్ రెడ్డి…సోమవారం సంతోష్ బాబు కుటుంబ సభ్యులను సీఎం కేసీఆర్ పరామర్శిస్తారని తెలిపారు.
ప్రభుత్వం తరపున ప్రకటించిన ఆర్ధిక సాయాన్ని , గ్రూప్ వన్ జాబ్ అపాయింట్ మెంట్ లెటర్ అందిస్తారన్నారు.సంతోష్ బాబు సేవలకు గుర్తుగా, యువతకు స్పూర్తిగా ఉండాలని కేసీఅర్ భావిస్తున్నారు.వారి కుటుంబానికి ప్రభుత్వం తరుపున సంపూర్ణ మద్దతు.భవిష్యత్ లో కుటుంబ అవసరాల రీత్యా 5కోట్ల నగదు, ఇంటి జాగా ఇవ్వాలని కేసీఆర్ ప్రకటించారు.
అదే విధంగా గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వాలని, అది కూడా ఆసక్తి ఉన్న ఉద్యోగం ఇవ్వాలనే కేసీఆర్ ఆలోచన అన్నారు.ప్రభుత్వ సాయంపై వ్యక్తిగతంగా కుటుంబాన్ని కలిసి చెప్పమన్నారు.ప్రభుత్వ సాయాన్ని వారు సంతోషంగా ఒప్పుకున్నారు.
దేశంలోని ఇతర సైనికులకు సాయం చేయడం సీఎం కేసీఆర్ గొప్పమనసుకు ,మానవతా దృక్పథానికి నిదర్శనం అన్నారు.కొడుకు పోయిన బాధ కంటే దేశం కోసం చనిపోయాడని వాళ్ళు చెప్పడం సంతోష్ బాబు తల్లిదండ్రుల గొప్పదానానికి నిదర్శనం అన్నారు.