ఇక జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ బిజీబిజీ!

131
kcr
- Advertisement -

ఇకపై దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారు సీఎం కేసీఆర్. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చుతూ ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలో కేసీఆర్ ఢిల్లీలో పర్యటించనున్నారు.

ఈనెల 14 వ తేదీన ఢిల్లీ సర్దార్ పటేల్ మార్గ్ లోని భారత్ రాష్ట్ర సమితి [బీఆర్ఎస్] జాతీయ కార్యాలయం ప్రారంభంకానుంది. అదేరోజు బీఆర్ఎస్ జాతీయ కార్యవర్గం ఏర్పాటు. జాతీయ కార్యదర్శుల నియామకం, ప్రకటన ఉండే అవకాశం ఉంది. ఢిల్లీలో అనేకమంది రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు, మీడియా ప్రతినిధులతో కూడా కేసీఆర్ భేటీ కానున్నారు.

తెలంగాణను ఏ విధంగానైతే అభివృద్ధి చేసుకొన్నామో.. అదే విధంగా దేశాన్ని బాగుచేసుకొనేందుకు కదులుదాం అని సీఎం కేసీఆర్‌ దసరా రోజు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. గెలువాల్సింది పార్టీలు కాదు.. ప్రజలు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే నా అభిమతం అని ప్రకటించిన సీఎం కేసీఆర్…ఆ దిశగా వడివడిగా అడుగులు వేయనున్నారు. ఇక ఇవాళ తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలతో సమావేశం నిర్వహించనున్న సీఎం…నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి దేశంలోనే అగ్రభాగాన నిలిపినా.. ఒక యజ్ఞం మాదిరిగా కఠోర దీక్షతో చేశారు. ఇప్పుడు దేశంలోని 140 కోట్ల ప్రజలను గెలిపించేందుకు మరో మహా యజ్ఞాన్ని చేపడుతున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -