టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమావేశం..

201
cm kcr

టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్నారు సీం కేసీఆర్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే 20 జిల్లాల పరిధిలోని ఎంపీలు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలతో ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం 12 గంటలకు ఈ భేటీ జరగనుంది.

ఉమ్మడి నల్లగొండ, వరంగల్‌, ఖమ్మంతోపాటు హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల ప్రజాప్రతినిధులు పాల్గొననుండగా పార్టీ అభ్యర్థుల విజయానికి పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేలా దిశానిర్దేశం చేయనున్నారు.

ఖమ్మం, నల్లగొండ, వరంగల్‌ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వరరెడ్డి, హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ నియోజకవర్గం నుంచి ఎన్‌.రామచంద్రరావు కొనసాగుతున్నారు. వీరి పదవీకాలం త్వరలో ముగియనుండటంతో ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నారు.