మోస‌గాళ్ళు టీజ‌ర్ రిలీజ్ చేసిన అల్లు అర్జున్..

113
manchu vishnu

మంచు విష్ణు హీరోగా జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మోస‌గాళ్లు’ . భార‌త్‌లో మొద‌లై అమెరికాను వ‌ణికించిన చ‌రిత్ర‌లోనే అతి పెద్ద ఐటీ కుంభ‌కోణం నేప‌థ్యంలో వాస్త‌వ ఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

విష్ణు సోద‌రిగా కాజ‌ల్ అగ‌ర్వాల్ కనిపిస్తుండగా సినిమా ప్రమోషన్‌లో భాగంగా టీజర్‌ని రిలీజ్ చేసింది. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ టీజర్‌ని రిలీజ్ చేయగా బాలీవుడ్ సీనియ‌ర్ స్టార్ యాక్ట‌ర్ సునీల్ శెట్టి ఈ చిత్రంతో టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.

2016లో జరిగిన ఈ 450 మిలియన్ డాలర్ల బిగ్గెస్ట్ స్కామ్ కోసం అగ్ర రాజ్య అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లో అడ్రెస్ చేస్తున్న స్పీచ్ తో టీజ‌ర్ మొద‌లు ఆటిప్పుడే మొదలయ్యింది అని విష్ణు ఈ గ్లింప్స్ ను ఎండ్ చేశాడు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ మరియు మళయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

Mosagallu Official Teaser | Vishnu Manchu | Kajal Aggarwal | Jeffrey Gee Chin | AVA Entertainment