సాగర్‌,శ్రీశైలంకు కొనసాగుతున్న వరద..

168
nagarjuna sagar
- Advertisement -

నాగార్జున సాగర్‌,శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలంకు వరద పొటెత్తడంతో 5 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగవకు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో : 1,38,264 క్యూసెక్కులుగా ఉండగా ఔట్ ఫ్లో : 1,66 ,549 క్యూసెక్కులు.పూర్తి స్థాయి నీటి మట్టం: 885 అడుగులు కాగా ప్రస్తుతం : 884.60 అడుగులు. పూర్తిస్దాయి నీటి నిల్వ : 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం: 213.4011 టీఎంసీలు .కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో 4 క్రస్టుగేట్లు 10 ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. ఇన్ ఫ్లో : 1,22,376 క్యూసెక్కులుగా ఉండగా అవుట్ ఫ్లో :1,05,776 క్యూసెక్కులు.పూర్తిస్థాయి నీటి నిల్వ: 312.0450 టీఎంసీలుగా ఉండగా ప్రస్తుత నీటి నిల్వ : 310.8498 టీఎంసీలు కాగా పూర్తిస్థాయి నీటిమట్టం:590 అడుగులు. ప్రస్తుత నీటిమట్టం: 589.60 అడుగులు.

- Advertisement -