తమిళనాడులో సీఎం కేసీఆర్ పర్యటన మూడో రోజుకు చేరింది. ఈరోజు ఆయన మక్కల్ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) అధినేత, నటుడు కమల్ హాసన్ భేటీ అవనున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు కమల్ హాసన్‌తో చర్చలు జరపనున్నారు. అనంతరం మధ్యాహ్నానికి హైదరాబాద్ చేరుకుంటారు. ప్రత్యేక విమానంలో చెన్నై నుంచి హైదరాబాద్ చేరుకుంటారు.
ఇక బుధవారం తమిళనాడు సీఎం స్టాలిన్‌తో భేటీ అయ్యారు సీఎం కేసీఆర్. యాదాద్రి దేవాలయ పున ప్రారంభ వేడుకలకు రావాలని స్టాలిన్‌ను ఆహ్వానించనున్నారు. పున సంప్రోక్షణ జరిగే వారం రోజుల్లో ఏదో ఒకరోజు వచ్చి యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దర్శనం చేసుకోవాలని సీఎం కేసీఆర్, స్టాలిన్ను కోరారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతలో తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పునర్నిర్మిస్తున్న యాదాద్రి క్షేత్ర పున సంప్రోక్షణ కార్యక్రమాలు వారం రోజుల పాటు జరగనున్నాయి. అవి మార్చి 22 వ తేదీన సుదర్శన యాగంతో ప్రారంభమై 28 వ తేదీ అర్ధరాత్రి ముగుస్తాయి. 29 వ తేదీ తెల్లవారుజాము నుంచి యాదాద్రి పుణ్యక్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దర్శనం కోసం సందర్శకులను అనుమతిస్తారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగే పున ప్రారంభ కార్యక్రమానికి దేశవిదేశాల నుంచి అతిథులు హాజరుకానున్నారు.