రాష్ట్రంలో దళితుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ‘ సిఎం దళిత్ ఎంపవర్ మెంట్ ’ పథకానికి సంబంధించి విధి విధానాల రూపకల్పన కోసం చర్చించడానికి ఇవాళ ప్రగతి భవన్ లో అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఉదయం 11.30 గంటలకు ప్రగతి భవన్ లో సమావేశం ప్రారంభంకానుంది.
దళిత ప్రజాప్రతినిధులతో కూడిన ఈ అఖిలపక్ష సమావేశంలో రాష్ట్రంలోని అన్ని పార్టీలకు చెందిన దళిత ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. వారితో పాటు ప్రతిపక్ష ఎం ఐ ఎం, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఫ్లోర్ లీడర్లు కూడా పాల్గొననున్నారు.
దళితుల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ అయ్యేలా పథకానికి రూపకల్పన చేశారు. ఏటా కొంతమంది లబ్దిదారులను ఎంపిక చేయనుండగా 8 లక్షల కుటుంబాలకు లబ్ధి జరగనుంది. ఈ ఏడాది రూ.1000 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేయగా సబ్‌ప్లాన్‌తో ఈ స్కీంకు సంబంధం లేదని కలెక్టర్లకు తేల్చి చెప్పారు సీఎం కేసీఆర్.