సినీ క్రిటిక్ కత్తి మహేశ్‌ పరిస్థితి విషమం..

134
kathi mahesh
- Advertisement -

సినీ క్రిటిక్ కత్తి మహేశ్‌ పరిస్థితి విషమంగా ఉంది. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం జాతీయ రహదారి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కత్తి మహేష్ తీవ్రంగా గాయపడగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఒక కన్ను దెబ్బతినగా శ్వాస పీల్చుకోవడంలో కూడా ఇబ్బందిపడుతున్నట్లు డాక్టర్లు వెల్లడించారు.

ఈ పరిస్థితుల్లో మెరుగైన వైద్యం కోసం ఆయనను చెన్నై తరలించాలని కుటుంబ సభ్యులు కోరగా.. ప్రత్యేక అంబులెన్స్ లో చెన్నై తీసుకెళ్లారు. చెన్నైలోని ఓఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కత్తి మహేష్ శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయాయని సమాచారం.

- Advertisement -