తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసే స్థానం మారబోతున్నారని గత కొన్నాళ్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 2014, 2018 ఎన్నికల్లో గజ్వేల్ నుంచి పోటీ చేసిన కేసిఆర్.. ఆ స్థానంలో తిరుగులేని మెజారిటీ సాధించి ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నారు. అయితే ఈసారి మాత్రం ఆయన గజ్వేల్ బరిలో నిలిచే అవకాశం లేదని పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్రం విడిపోకముందు సిద్దిపేట కు ప్రాతినిథ్యం వహించిన కేసిఆర్.. ఆ తర్వాత గజ్వేల్ బరిలో నిలిచారు. మళ్ళీ ఇప్పుడు స్థానం మార్చి ముందుకెళ్లే ఆలోచనలో ఉన్నారట. ఇప్పటివరకు ఉత్తర తెలంగాణలో పోటీ చేసిన ఆయన ఈసారి దక్షిణ తెలంగాణలో పోటీ చేసే ఆలోచనలో ఉన్నారట. .
ఉమ్మడి నల్గొండ జిల్లా లేదా మహబూబ్ నగర్ లోని ఏదో ఒక నియోజిక వర్గంలో పోటీ చేయాలని కేసిఆర్ భావిస్తున్నాట్లు టాక్ నడిచింది. కేసిఆర్ పోటీ చేసే స్థానంపై తాజాగా కామారెడ్డి నియోజిక వర్గ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. వచ్చే ఎన్నికల్లో కేసిఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేసే అవకాశం ఉందని.. ఆయన కామారెడ్డి నుంచి నిజంగానే పోటీ చేస్తే తాను కార్యకర్తగా నియోజిక వర్గంలో పని చేస్తానని చెప్పుకొచ్చారు. దీంతో కేసిఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేయబోతున్నారా ? అనే వాదన బలపడుతోంది. అయితే తాను పోటీ చేస్తే స్థానంపై కేసిఆర్ ఇంతవరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. దీంతో బిఆర్‌ఎస్ బాస్ ఎక్కడి నుంచి బరిలోకి దిగబోతున్నారో అనే చర్చ రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ హాట్ గా సాగుతోంది.
Also Read:ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ అమోదం..