సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన టీఆర్ఎస్ ఎల్పీ భేటీ..

202
- Advertisement -

మంగళవారం సాయంత్రం తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశం ప్రారంభమైంది. టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఈ భేటీ జరుగుతోంది. తెలంగాణ వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తూ, తెలంగాణ రైతులను, ప్రజలను అయోమయానికి గురి చేస్తున్న తీరుతెన్నుల మీద చర్చించి భవిష్యత్ కార్యాచరణను టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం రూపొందించనున్నది. ఈ సమా‌వే‌శానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజ‌ర‌య్యారు.

- Advertisement -