నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ హాలీయాలో సీఎం కేసీఆర్ బహిరంగసభ నిర్వహించనున్నారు. కరోనా నిబంధనల మధ్య సీఎం సభ సాయంత్రం 4 గంటలకు ప్రారంభంకానుండగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలుచేసిన వివిధ పథకాల ద్వారా లబ్ధిపొందిన దాదాపు లక్షన్నర మంది సభకు హాజరుకావచ్చని టీఆర్‌ఎస్ నేతలు భావిస్తున్నారు.
హాలియా పట్టణంలోని పెద్దవూర రోడ్డులో పాత ఐటీఐకి ఎదురుగా ఉన్న 20 ఎకరాల స్థలంలో సభను నిర్వహివచనున్నారు. ప్రధాన సభావేదికతోపాటు పక్కనే కళాకారుల కోసం ప్రత్యేక వేదిక, వీఐపీ, మీడియా గ్యాలరీల ఏర్పాటు పూర్తయింది.
సభాస్థలంలో ఎక్కువభాగం కవర్ అయ్యేలా కార్పెట్లను పరిచారు. సాయంత్రం ఐదు గంటలకు సీఎం కేసీఆర్ సభాస్థలికి వస్తారు.ఇందుకోసం సభా వేదిక పక్కనే ప్రత్యేక హెలిపాడ్ ఏర్పాటుచేశారు. సభకు వచ్చే వారి వాహనాల కోసం హాలియాకు మూడువైపులా ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలను ఏర్పాటుచేశారు.