కరోనా కేసులు..బ్రెజిల్‌ను దాటేసిన భారత్

346
coro
- Advertisement -

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. రోజుకు లక్షన్నరకు పైగా కేసులు నమోదవుతుండగా కరోనా కేసులపరంగా భారత్‌ మరోసారి బ్రెజిల్‌ను దాటింది. ప్రపంచ దేశాల్లో అమెరికా తర్వాత రెండో స్థానంలో ఉంది.

గత 24 గంట‌ల్లో 1,68,912 కేసులు న‌మోదుకాగా 904 మంది మృతిచెందారు. ఇప్ప‌టి వ‌ర‌కూ క‌రోనా బారిన ప‌డిన వారి మొత్తం సంఖ్య 1.35 కోట్ల‌కు చేర‌గా, మ‌ర‌ణించిన వారి సంఖ్య 1,70,179కి చేరింది.

కరోనా కేసులపరంగా ఫ్రాన్స్‌(50.5 లక్షలు), రష్యా (46.4 లక్షలు), బ్రిటన్‌ (43.6 లక్షలు), టర్కీ (38.4 లక్షలు), ఇటలీ (37.6 లక్షలు), స్పెయిన్‌ (33.4 లక్షలు), జర్మనీ (30 లక్షలు) ఉన్నాయి.

- Advertisement -