ట్రెండింగ్‌లో బాలయ్య అఖండ!

78
nbk

బోయపాటి శ్రీనివాస్- నటసింహం నందమూరి బాలకృష్ణ కాంబోలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రం అఖండ. సింహా, లెజెండ్ చిత్రాల త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ మూవీపై అభిమానుల‌లో భారీగా అంచనాలు పెరిగిపోగా ‘బీబీ3’ టైటిల్ ను రివీల్ చేస్తూ ఓ వీడియోను పోస్ట్ చేశారు మేకర్స్.

మునుపెన్నడూ లేని విధంగా బాలయ్య సినిమా టీజర్ అలా వచ్చి రాగానే వైరల్‌గా మారింది. కొన్ని గంటల్లోనే 5 మిలియన్ వ్యూస్ సాధించింది యూ ట్యూబ్ ట్రెండింగ్‌లో నెంబర్‌ 1గా నిలిచింది. ప్ర‌గ్యా జైస్వాల్,పూర్ణ, జగపతి బాబు కీలకపాత్రల్లో నటిస్తుండగా ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Akhanda | #BB3 Title Roar | Nandamuri Balakrishna | Boyapati Srinu | Thaman S | Dwaraka Creations