సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన గంగుల..

105
kcr
- Advertisement -

లోయర్ మానేరు నదిని సుందరీకరించడం, పటిష్టపరచడం కోసం ప్రభుత్వం చేపట్టిన, మానేరు రివర్ ఫ్రంటులో భాగంగా … నాలుగు కిలోమీటర్ల మేరకు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి గాను 310.464 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జీవో కాపీని సిఎం కెసిఆర్ స్వయంగా తన చేతుల మీదుగా మంత్రి గంగుల కమలాకర్ కు, శుక్రవారం ప్రగతి భవన్ లో అందచేశారు.

ఈ జీవో కాపీని అందుకున్న మంత్రి గంగుల సిఎం కెసిఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. మానేరు రివర్ ఫ్రంటు నిర్మాణ పనుల డీపీఆర్ తయారీకి టెండర్ ఖరారు కోసం విధి విధానాలను రూపొందించడానికి గాను మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ అధ్యక్షతన మంత్రి గంగుల కమలాకర్ , పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ లతో ఆధ్వర్యంలో సంబంధిత శాఖల అధికారులతో జూన్ 12న సమన్వయ సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు.
కాగా.. మానేరు రివర్ ఫ్రంటులో భాగంగా రూ. 80 కోట్ల వ్యయంతో చెక్ డ్యాంల నిర్మాణం, రూ.190 కోట్లతో కేబుల్ బ్రిడ్జీ నిర్మాణ పనులు ఇప్పటికే చేపట్టారు.

- Advertisement -