- Advertisement -
రాష్ట్రవ్యాప్తంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. హెచ్ఐసీసీలో సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జాతీయ జెండాను ఆవిష్కరించి, ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం జ్యోతిప్రజ్వలన చేసి.. జాతిపిత గాంధీజీ, భరతమాత విగ్రహాలకు పూలమాలలు వేశారు. 15 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనుండగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
మధ్యాహ్నం 1 గంటకు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందేశాన్ని ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవాల కమిటీ చైర్మన్, ఎంపీ కే కేశవరావు, సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
- Advertisement -