ఈ గెలుపు మరింత బాధ్యతను పెంచిందిః సీఎం కేసీఆర్

587
kcr ktr
- Advertisement -

మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు మాపై మరింత బాధ్యతను పెంచింది అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. మున్సిపల్ ఎన్నికల భారీ విజయం సాధించిన అనంతరం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఈరోజు వెలువడ్డ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 360డిగ్రిలు ఒకేరకమైనటువంటి ఫలితాలు వచ్చాయి. గత ఆరు సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అవలంబిస్తునటువంటి విధానాలు నచ్చి ప్రజలు ఈ తీర్పును ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీలు ఏం మాట్లాడిన పట్టించుకోకండి మీ లక్ష్యం వైపు కొనసాగండి అంటూ ప్రజలు మాకు ఆదేశం ఇచ్చినట్లుగా భావిస్తున్నాం. మేము అవలంభిస్తున్న విధానాలు ప్రజలకు బాగా నచ్చాయని ఈసందేశం ద్వారా మాకు అర్ధమవుతుంది. ఈరోజు ఇంత ఖచ్చితమైనటువంటి తీర్పును ఇచ్చిన తెలంగాణ ప్రజలకు నా తరపున పార్టీ తరపున నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అని తెలిపారు. ఈఎన్నికల్లో గెలిచిన విజేతలు అందరికి హృదయపూర్వ అభినందనలు తెలియజేస్తున్నా. పార్టీ గెలుపుకోసం పనిచేసిన కార్యకర్తలకు కృతజ్నతలు.

kcr new

టీఆర్ఎస్ అభ్యర్దుల తరపున పనిచేసిన కార్యకర్తలు, రాష్ట్రస్ధాయి నేతలకు నేను పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నా ఆశిస్సులు తెలియజేస్తున్నా. ఇటువంటి ఘన విజయం ఏ పార్టీకి రాదు సామాన్యంగా..ఇది మాములు విషయం కాదు. గతేడాది డిసెంబర్ లో నేను అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లే ముందు అనేకమైనటువంటి దూషనలు చేశారు. కానీ ఆ ఎన్నికల్లో 88సీట్లతో గెలిచి వచ్చినాం. హుజుర్ నగర్ ఎన్నికతో టీఆర్ఎస్ పార్టీ సొంతంగా 89స్ధానాలు గెలుచుకున్నాం. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మెజార్టీ స్ధానాలు మాకే వచ్చినాయి. ఆ తదనంతరం జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో 32కు 32జిల్లా పరిషత్ లు కైవసం చేసుకున్నాం. ఇది ఆల్ ఇండియా రికార్డు. చాలా మంది ఈ ఎన్నికలు జరగకుండా చూశారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎన్నికలు నిర్వహించాం. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు అద్భుతమైనటువంటి తీర్పును ఇచ్చారు.

 

ఈ ఎన్నికల్లో ప్రతిపక్షనాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ముఖ్యమంత్రి, మంత్రులను, పార్టీ నాయకులను నోటికి వచ్చినట్లు తిట్టారు. వాళ్ల మాటలను ప్రజలు ఏ మాత్రం పట్టించుకోలేదని మనం ఫలితాలు చూస్తే అర్ధమైతుంది. సోషల్ మీడియాలో కూడా చాలా నీచంగా దుష్రచారం చేశారు. సోషల్ మీడియాకు అరికడతాం. సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీలు, మంత్రులు, నియోజకవర్గ ఇంఛార్జ్ లు రాత్రింబవళ్లు కష్టపడ్డారు. అందరూ కష్టపడి పనిచేశారు కాబట్టి ఈ ఫలితం వచ్చింది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ పెట్టిన ఖర్చు రూ.80లక్షలు మాత్రమే. పార్టీ మెటిరయల్ కోసం మాత్రమే ఈ ఖర్చు చేసినం. టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎలాంటి గర్వం రావద్దు. గెలిచినంత మాత్రన మనం గొప్ప కాదు. ప్రజలకు సేవ చేయాలని సూచించారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా ఎలాంటి ఫలితాలైతే సాధించినమో..అలాగే త్వరలోనే పట్టణ ప్రగతి కార్యక్రమాలు కూడా ప్రారంభిస్తాం. ఈ ఎన్నికల్లో గెలిచిన చైర్మన్లు, కార్పొరేషన్లు, కౌన్సిలర్లకు త్వరలోనే శిక్షణ తరగతులు నిర్వహిస్తాం అన్నారు.

kcr kk

- Advertisement -