బన్ని సుకుమార్ మూవీ విడుదల తేదీ ఖరారు

287
Allu Arjun Sukumar

అల..వైకుంఠపురంలో సినిమాతో భారీ విజయాన్ని సాధించాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. కాగా అల్లు అర్జున్ తర్వాతి మూవీ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఇటివలే ఈమూవీ షూటింగ్ ప్రారంభమైంది. ఫిబ్రవరి లో అల్లు అర్జున్ ఈషూటింగ్ లో పాల్గొననున్నాడు. ప్రస్తుతం ఈమూవీ షూటింగ్ కేరళలో జరుగుతుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అల్లు అర్జున్ ఈచిత్రంలో లారీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నాడు. ‘శేషాచలం’ అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఈమూవీలో బన్నికి జోడిగా రష్మిక మందన నటించనుంది. అయితే తాజాగా ఈమూవీవిడుదల తేది ఖరారైనట్లు తెలుస్తుంది. సెప్టెంబర్ లో ఈమూవీని విడుదల చేయాలని భావిస్తున్నారు చిత్రయూనిట్. త్వరలోనే ఈమూవీ విడుదలపై అధికారిక ప్రకటన రానుంది. కాగా బన్ని త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఆర్య, ఆర్య2 సినిమాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ రెండు మూవీలో మంచి విజయం సాధించాయి. ఈమూవీతో బన్నితో సుకుమార్ హ్యాట్రిక్ కొడతాడో లేదో చూడాలి మరి.