సీఏఏపై అసెంబ్లీలో చర్చ: సీఎం కేసీఆర్

493
cm kcr
- Advertisement -

సీఏఏపై అసెంబ్లీలో చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు సీఎం కేసీఆర్. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా మాట్లాడిన సీఎం..కేంద్రం నుంచి రాష్ట్రానికి జీఎస్టీ బకాయిలు రావడం లేదన్నారు. జీఎస్టీ విషయంలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ వ్యాఖ్యలను సమర్ధిస్తున్నట్లు చెప్పారు.

సీఏఏపై అన్ని పార్టీల వారికి అవకాశం ఇస్తామని..బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా తన అభిప్రాయాలను చెప్పవచ్చన్నారు. సీఏఏపై అందరి సభ్యులకు అవకాశం కల్పించాలని ..సీఏఏ చాలా కీలకమైన అంశం అని దీనిపై పూర్తిస్థాయిలో చర్చ జరగాలన్నారు.

సీఏఏపై దేశంలో ఉద్విగ్న వాతావరణం ఉంది. సీఏఏపై జరిగే చర్చ ఒక రోజుతో అయ్యేది కాదన్నారు. ఇప్పటికే పార్లమెంట్‌లో తాము సీఏఏని వ్యతిరేకించామన్నారు.వచ్చే తరాలపై పడే ప్రభావాన్ని అందరం చర్చించాలని..సభ అంతిమ ఉద్దేశాన్ని కేంద్రాన్ని తెలియజేద్దాం అన్నారు. సీఏఏపై సభలో మాట్లాడాలని కేబినెట్‌లో ఇంతకు ముందే తీర్మానం చేసిశామని సీఎం కేసీఆర్‌ గుర్తుచేశారు.

- Advertisement -