మహేష్‌ బాబు @ 9 మిలియన్స్‌

239
mahesh babu

టాలీవుడ్ సూపర్‌స్టార్‌గా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నటుడు మహేష్ బాబు. ఇటీవలె సరిలేరు నీకెవ్వరు సినిమాతో సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసిన మహేష్ తాజాగా దక్షిణాదిలో తనకు ఎవరు సరిలేరనిపించుకున్నారు.

తన నటనతో దేశ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న మ‌హేష్ సోషల్ మీడియాలో దక్షిణాదిలో ఏ హీరోకు సాధ్యంకానంత ఫ్యాన్ ఫాలోయింగ్‌తో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం మహేష్‌ని ట్విట్టర్‌లో ఫాలో అయ్యే వారి సంఖ్య 9 మిలియ‌న్స్‌కి చేరింది.

తన సినిమాలకు సంబంధించిన వార్తలతో పాటు ప‌ర్స‌న‌ల్‌,టూర్స్‌, పిల్ల‌ల విష‌యాలు ఎప్పటికప్పుడు ట్విట్టర్‌ ద్వారా షేర్ చేస్తుంటాడు మహేష్‌. దీంతో సోషల్ మీడియాలో ఆయన్ని అనుకరించే వారి సంఖ్య పెరిగిపోయింది.

స‌రిలేరు నీకెవ్వ‌రు తర్వాత మహేష్…వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. దీంతో పాటు చిరు 152వ చిత్రంలో మ‌హేష్ నటించనున్నారనే వార్తలు వెలువడుతున్నాయి.