రష్మీక @ 1 మిలియన్

483
rashmika
- Advertisement -

ఛలో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అందరి మనసులు దోచేసింది రష్మీక మందన్నా . ఆ తర్వాత విజయ్ దేవరకొండతో కలిసి గీత గోవిందం మూవీలో నటించి టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ఇటీవలె సరిలేరు నీకెవ్వరుతో హిట్ కొట్టిన రష్మీక చేసింది కొద్దిసినిమాలే అయినా టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా ఎదిగింది.

ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రష్మీకా ఫాలోవర్లు 1 మిలియన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా స్పందించిన రష్మీకా తన ఫ్యాన్స్‌తో పాటు ఫాలోవర్లకు థ్యాంక్స్‌ చెప్పింది. మిలియన్ ఫ్యామిలీలో తనను చేర్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం రష్మీకా…అల్లు అర్జున్‌తో సినిమా చేస్తోంది.

- Advertisement -