CM KCR:ఎన్నికల్లో ప్రజలు గెలవాలి

34
- Advertisement -

ఎన్నికల్లో ప్రజలు గెలవాలి…నేతలు కాదన్నారు సీఎం కేసీఆర్. హుజుర్‌నగర్ ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన సీఎం కేసీఆర్…ఈ ఎన్నికల్లో మంచి, చెడులను విచారించి ఓటు వేయాలన్నారు. ఎన్నికల గెలుపు ప్రజల గెలుపు కావాలని…ఎవరి వల్ల మంచి జరుగుతుందో ఆలోచించి ఓటు వేయాలన్నారు. ప్రజలంతా ఏ పార్టీలు ఏం చేశాయో ఆలోచించి ఓటు వేయాలన్నారు.

దళిత బిడ్డలు యుగయుగాలు అణచి వేయబడుతున్నారని…అందుకే వారి కోసం దళిత బంధు తీసుకొచ్చామని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దళితుల అభ్యున్నతి కోసం ఏమాత్రం కృషి చేసిన వారి పరిస్థితి ఇప్పటికి ఇదే విధంగా ఉండేది కాదన్నారు. గిరిజన బిడ్డలు మా తండాలో మా రాజ్యం కావాలని కొట్లాడారు..కానీ ఎవరు చేయలేదన్నారు.బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తండాలను గ్రామ పంచాయతీలు చేశామన్నారు. ఎన్నికల్లో నిలబడ్డ వ్యక్తినే కాదు ఆ వ్యక్తి వెనుక ఉన్న పార్టీ గురించి చర్చ జరగాలన్నారు.

కళ్ల ముందు చరిత్రను కూడా నాయకులు వక్రీకరిస్తారన్నారు. నాగార్జున సాగర్‌ 20 కిలో మీటర్ల పైకి కట్టాల్సి ఉండే కానీ దానిని ఇప్పుడున్న చోట కడుతుంటే కాంగ్రెస్ నాయకులు చప్పుడు చేయలేదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పాపాత్ములని…ఎన్నో ఘోరాలకు సాక్ష్యులుగా ఉన్నారన్నారు. భవిష్యత్ అంతా యువతదేనని…యువత జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలన్నారు.గులాబీ జెండా ఎగిరినంక ప్రతి విషయంలో బీఆర్ఎసే కొట్లాడిందన్నారు. తెలంగాణకు ఒక్క పైసా కూడా ఇయ్యమని ఆ నాడు సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి అంటే ఒక్కడంటే ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడలేదన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలల్లో ఒక్క మొగోడు కూడా లేడా అని ప్రశ్నించారు. 1969లో కాంగ్రెస్ చేసిన ఒక్క పొరపాటుతో దశాబ్దాలుగా గోస పడ్డామన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు లేక గోస పడ్డామన్నారు.

Also Read:బీఆర్ఎస్‌లో చేరిన నాగం, విష్ణువర్ధన్ రెడ్డి

కేసీఆర్ చచ్చుడో…తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో చావు నోట్లో తలపెడితే తెలంగాణ వచ్చిందన్నారు. వచ్చాక ప్రజలు బీఆర్ఎస్‌ని గెలిపించారన్నారు. కాంగ్రెసే గెలిచే పరిస్థితి లేదని…ముఖ్యమంత్రి ఎట్లయితరని ఎద్దేవా చేశారు. రైతుల మోటార్లు కాలిపోతే పట్టించుకునే నాధుడు లేడు…కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదన్నారు. బీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. రైతు బంధు పదాన్ని పుట్టించిందే కేసీఆర్ అన్నారు. రైతులు పంటలు పండిస్తూ తన కలలు నిజం చేశారన్నారు. ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ ని మించి పోయామన్నారు.

- Advertisement -