‘దేవర’ నాన్ స్టాప్ ప్రమోషన్స్ అట

27
- Advertisement -

ఏమిటో ఎన్టీఆర్ దేవర సినిమా పై నిత్యం అనేక పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. దేవర ప్రమోహన్స్ కోసం కొరటాల శివ ఓ టీమ్ ను రెడీ చేసినట్లు తెలుస్తోంది. మరి నిజంగానే ఈ మూవీ ప్రమోషన్స్ అప్పుడే మొదలు కాబోతున్నాయా..?, అసలు ఇప్పటివరకు దేవర ఫస్ట్ సింగిల్ జాడ లేదు. కానీ..దేవర ప్రమోషన్స్ పై అప్పుడే ఈ రకమైన న్యూస్ లు చూస్తే ఎన్టీఆర్ అభిమానులకి సంతోషంగా ఉన్నా.. మేకర్స్ నుంచి ఎలాంటి క్లారిటీ లేకుండా వీటిని నమ్మడానికి లేదు అనే మాట నెటిజెన్స్ నుంచి వినిపిస్తోంది. కానీ, ఈ సినిమా పై తాజా రూమర్ మాత్రం చాలా బలంగా వినిపిస్తోంది.

అదేమిటంటే, సోషల్ మీడియాలో నవంబర్ నుంచి ఫస్ట్ సింగిల్ తో ప్రమోషన్స్ మొదలు పెట్టి, నాన్ స్టాప్ గా ఈ సినిమా విడుదల వరకూ, అంటే.. వచ్చే ఏప్రిల్ వరకు ప్రమోషన్స్ చెయ్యాలని మేకర్స్ ప్లాన్ చేసారంట. దేవర నుంచి ఒక్కసారి ప్రమోషన్స్ మొదలయ్యాక, ఆ సినిమా లుక్ అండ్ ఫీల్ తెలిసాక.. దేవర మీద పోటీకి దిగుతున్న ఇతర భాషా సినిమాలు చాలావరకు సమ్మర్ బరి నుంచి తప్పుకుంటాయనే ధీమాలో మేకర్స్ ఉన్నారట. మరి ఈ నాన్ స్టాప్ ప్రమోషన్స్ మేటర్ లో ఎంత నిజముందో అనేది ఫస్ట్ సింగిల్ విడుదలైతే కానీ చెప్పలేము,

ప్రస్తుతం మేకర్స్ ఈ ఫస్ట్ సింగిల్ ను దీపావళి కైనా లేదా ఆ తర్వాత వారంలోనైనా వదలాలని చూస్తున్నారట. ఇక ప్రస్తుతం దేవర షూటింగ్ గోవాలో జరుగుతుంది. ఎన్టీఆర్ – జాన్వీ కపూర్ ల పై ఓ మాస్ సాంగ్ ను షూట్ చేస్తున్నారు. దేవర సినిమా సముద్రం నేపథ్యంలో జరుగుతుంది. రివెంజ్ డ్రామాగా ఈ సినిమా కథను కొరటాల శివ తన మార్క్ ఉండేలా కథని రాసుకున్నారట. ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు.

Also Read:బీఆర్ఎస్‌లో చేరిన నాగం, విష్ణువర్ధన్ రెడ్డి

- Advertisement -