తెలంగాణలో తెలుగు తప్పనిసరి – కేసీఆర్‌

185
CM KCR speech in telugu mahasabhalu
- Advertisement -

ఈ రోజు ముగింపు వేడుకలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ హాజరైనందుకు రాష్ర్ట ప్రజలందరి తరపున ఆయనకు ధన్యవాదాలు తెలిపారు సీఎం కేసీఆర్‌. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకల్లో మాట్లాడిన కేసీఆర్‌ 1974 లో డిగ్రీ విద్యార్థిగా ఇదే స్టేడియంలో తెలుగు మహాసభలను తిలకించానన్నారు.

తెలుగు మహాసభలు విజయవంతం అయినందుకు సంతోషంగా ఉందన్నారు.  ప్రతి ఏటా డిసెంబర్ లో రెండు రోజులపాటు ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహిస్తామన్నారు. అంతేకాకుండా తెలంగాణ గడ్డమీద చదవుకోవాలంటే తెలుగు సబ్జెక్ట్‌ ఖచ్చితంగా ఉండాల్సిందేన్నారు సీఎం.

జనవరి మొదటి వారంలో భాషా సాహితీవేత్తల సదస్సును కూడా నిర్వహిస్తామని, వారి సూచనలు స్వీకరించి కీలక నిర్ణయాలు ప్రకటిస్తామన్నారు. అలాగే పదవి విరమణ పొందిన భాషాపండితుల భృతిలో కోతను ఎత్తేస్తామన్నారు సీఎం కేసీఆర్‌

- Advertisement -