29న ‘బాహుబలి 2’ రిలీజ్‌..

256
- Advertisement -

ప్ర‌పంచానికి భార‌తీయ సినిమాను స‌రికొత్త‌గా ప‌రిచ‌యం చేసిన చిత్రం బాహుబ‌లి. రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డు కలెక్షన్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు (గ్రాస్‌) సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. ఈ ఏడాది ఏప్రిల్ 28న విడుదలై ఇండియాలోనే కాక ప్రపంచంలో పలు దేశాల్లో కలెక్షన్ల వర్షం కురిపించింది ‘బాహుబలి: ది కంక్లూజన్’. ఏకంగా 1700 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో సంచలనం సృఫ్టించిందీ సినిమా.

‘బాహుబలి: ది బిగినింగ్’ తరహాలోనే ముందు ఇండియాలో.. కొన్ని దేశాల్లో సినిమాను రిలీజ్ చేసి.. ఆ తర్వాత మిగతా దేశాలపై దృష్టిసారించింది చిత్ర బృందం. చైనాలో ‘ది కంక్లూజన్’ను భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేశారు కానీ.. అనివార్య కారణాల వల్ల అక్కడ ఇంకా ఆ చిత్రం రిలీజవ్వలేదు. ఐతే ఇప్పుడు మరో ఆసియా దేశం జపాన్ లో ఈ చిత్రం పెద్ద ఎత్తున రిలీజవ్వబోతోంది.

Baahubali 2 to Finally Release in Japan

డిసెంబరు 29న జపాన్ ప్రేక్షకుల్ని పలకరించబోతోంది ‘బాహుబలి: ది కంక్లూజన్’. గత కొన్నేళ్లలో సౌత్ ఇండియన్ సినిమాలకు జపాన్ లో ఆదరణ బాగా పెరిగింది. రజినీకాంత్ అక్కడ కూడా సూపర్ స్టారే. ఆయన సినిమాలు భారీ ఎత్తున రిలీజవుతాయి. మన స్టార్ హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ కు జపాన్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ‘బాహుబలి: ది బిగినింగ్’ జపాన్లో మంచి వసూళ్లు రాబట్టింది. ‘ది కంక్లూజన్’ కూడా అక్కడ మంచి ఫలితమే అందుకుంటుందని భావిస్తున్నారు. అక్కడ పబ్లిసిటీ కూడా బాగానే చేస్తున్నారు. ఈ రోజు ‘బాహుబలి-2’ జపాన్ లాంగ్వేజ్ పోస్టర్ కూడా లాంచ్ చేశారు. జపాన్ తర్వాత త్వరలోనే చైనా సహా మరి కొన్ని దేశాల్లోనూ ‘బాహుబలి: ది కంక్లూజన్’ రిలీజయ్యే అవకాశముంది.

- Advertisement -