నాడు వలసల వనపర్తి…నేడు వరి పంటల వనపర్తి

17
- Advertisement -

దళితులను ఓటు బ్యాంకుగానే కాంగ్రెస్ వాడుకుందని ఆరోపించారు సీఎం కేసీఆర్. వనపర్తి ప్రజా ఆశీర్వద సభలో మాట్లాడిన సీఎం..తనతో పాటు ఉద్యమాన్ని ప్రారంభించిన వారిలో నిరంజన్ రెడ్డి ఒకరన్నారు. ఒకడు దమ్ముంటే కొడంగల్‌కి రా అని మరొకడు గాంధీ బొమ్మ దగ్గరకు రావాలని మరొకడు…కానీ ఇవాళ 119 నియోజకవర్గాల్లో ఉంది కేసీఆర్‌లే అన్నారు.

తాను చెప్పింది గ్రామల్లో చర్చ జరగాలన్నారు. 14 ఏళ్ల ఉద్యమం తర్వాత తెలంగాణ వచ్చిందన్నారు. జరిగిన వాస్తవాలు ప్రజల ముందే ఉన్నాయని ప్రజలంతా ఆలోచించాలన్నారు. నాడు తెలంగాణకు అన్యాయం చేసింది ఎవరు….ఇవాళ తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటుంది ఎవరో గుర్తుచేసుకోవాలన్నారు.వలసల వనపర్తిని పంటల వనపర్తిగా మార్చింది నిరంజన్ రెడ్డి అన్నారు.

వందకు వంద శాతం నిరంజన్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత తనదన్నారు. 10 ఏళ్లలో ఏం జరిగిందో కళ్ల ముందే ఉందన్నారు. ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకుంది కాంగ్రెస్ పార్టీ కాదా అని మండిపడ్డారు.ఏ పథకం తెచ్చినా చాలా ఆలోచించే తెచ్చామన్నారు. తెలంగాణ వలసలతో ఆగమైంది కానీ నేడు ప్రగతి పథంలో దూసుకుపోతుందన్నారు.

Also Read:దోసకాయతో ఉపయోగాలు..

- Advertisement -