దేశానికే కర దీపికగా..తెలంగాణ

27
kcr cm
- Advertisement -

దేశానికే దిశానిర్దేశం చేసే కర దీపికగా తెలంగాణ మారిందన్నారు సీఎం కేసీఆర్. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు సీఎం కేసీఆర్. ఎనిమిదేళ్ల స్వల్పకాలంలో తెలంగాణ ఎంతో ప్రగతిని సాధించిందన్నారు. తలససరి ఆదాయం పెరుగుదలలో తెలంగాణ రాష్ట్రం రికార్డు సాధించిందన్నారు. 2014-15లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,24,124 కాగా.. 2021-22 నాటికి రూ.2,78,833కు పెరిగిందని ఇది జాతీయ తలసరి ఆదాయం కంటే ఎక్కువన్నారు.

ఆర్థికవృద్ధిలో, తలసరి ఆదాయం పెరుగులలో, విద్యుత్‌ సరఫరా, తాగు, సాగునీటి సదుపాయం, ప్రజసంక్షేమం, పారిశ్రామిక, ఐటీ రంగాలతో పాటు అనేక రంగాల్లో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఎనిమిదేళ్ల స్వల్పకాలంలో దేశానికే దిశానిర్దేశం చేసే కరదీపగా తెలంగాణ మారిందని…ఇది ప్రజలందరి దీవెన, ప్రభుత్వ సిబ్బంది అంకితభావం వల్లనే సాధ్యమైందన్నారు.

కరోనా సృష్టించిన సంక్షోభం నుంచి అతిత్వరగా తెలంగాణ కోలుకున్నదని భారత ఆర్థిక సర్వే 2020-21 అభినందించడం గొప్ప విషయమన్నారు. పెరిగిన ఆదాయంలో ప్రతి పైసా సద్వినియోగమయ్యే విధంగా ప్రభుత్వం జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా పెట్టుబడి వ్యయం చేస్తుందన్నారు.

- Advertisement -