ధాన్యం కొనుగోళ్లపై 20న రాష్ట్రవ్యాప్త నిరసన..

37
cm

ధాన్యం కొనుగోళ్లపై ఈ నెల 20న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్. తెలంగాణ భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న‌ టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి స‌మావేశం జరుగగా ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర వైఖరిపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

నియోజకవర్గాల్లో నిరసనలు తెలపాలని ఎమ్మెల్యేలకు సూచించారు సీఎం కేసీఆర్. రేపు ఢిల్లీకి మంత్రుల బృందం వెళ్లనుండగా కేంద్రమంత్రిని కలిసి మరోసారి ధాన్యం కొనుగోళ్లపై వైఖరి చెప్పాలని డిమాండ్ చేయనున్నారని తెలిపారు.

రైతుబంధు ప‌థ‌కం య‌థావిధిగా కొన‌సాగుతోంద‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. ఇత‌ర పంట‌లు వేసేలా రైతుల్లో చైత‌న్యం తేవాల‌ని సూచించారు. ద‌ళిత బంధుపై విప‌క్షాల ప్ర‌చారం తిప్పికొట్టాలి. ఈ ప‌థ‌కాన్ని ద‌శ‌ల వారీగా రాష్ట్ర‌మంతా అమ‌లు చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. నిరంత‌రం ప్ర‌జ‌ల్లో ఉండాల‌ని, క‌ష్ట‌ప‌డి ప‌ని చేయాల‌ని ఎమ్మెల్యేల‌కు సూచించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ గెలిపించుకునే బాధ్య‌త త‌న‌దే అని కేసీఆర్ తెలిపారు.