ప్రభుత్వం సహకారం అందిస్తే దేశానికి పేరు తీసుకొస్తా:అన్విత రెడ్డి

32
guduru

ఖైరతాబాద్ : ప్రభుత్వం సహకారం అందిస్తే దేశనికి పేరు తీసుకొస్తానని యాదాద్రి భువనగిరి జిల్లా ఎర్రబెల్లి గ్రామానికి చెందిన పతర్వాతాదిరోహకురాలు అన్విత రెడ్డి అన్నారు. డిసెంబర్ 7వ తేదిన రష్యాలో సముద్ర మట్టానికి 5450 మీటర్ల ఎత్తులో ఉన్న ‘ఎల్ బ్రస్ పర్వతం’ శిఖరాన్ని అధిరోహించి రష్యా నుండి శుక్రవారం నగరానికి చేరుకున్నారు.

ఈ సందర్బంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గూడూరు నారాయణరెడ్డి ఫౌండేషన్‌ చైర్మన్‌ గూడూరు నారాయణరెడ్డితో కలసి అన్విత రెడ్డి మాట్లాడుతూ తన గైడ్ చందూర్ సహకారంతో మైనస్ 40 డిగ్రీల చలిలో, గంటలకు 64 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలిలో పార్వతరోహణ చేసినట్లు తెలిపారు. ఎల్బ్రస్ పర్వతంపై 10 మీటర్ల భారత జాతీయ పతాకాన్ని రెపరెప లాడించానని చెప్పారు. దేశం నుంచి చలికాలంలో పార్వతారోహణ చేసిన మహిళగా గుర్తింపు దక్కడం ఎంతో సంతోషం అలిగించిందన్నారు. అతి త్వరలో ఎవరెస్టు, కె-2 పాకిస్తాన్, యూఎస్ (నార్త్ అమెరికా) శిఖరాలను అదిరోహించనున్నట్లు తెలిపారు. గత 5 ఏళ్లలో 4 పార్వతాలు అధిరోహించినట్లు తెలిపారు. ప్రస్తుతం రాక్ లైనింగ్ శిక్షకూరాలిగా పని చేస్తున్నట్లు చెప్పారు. తనకు స్పాన్సర్ గా వ్యవాహరించిన నారాయణరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.