సమైక్య పాలనలో ఆగమైపోయిన సిరిసిల్ల నేతన్నల తలరాత మార్చామన్నారు సీఎం కేసీఆర్. సిరిసిల్లలో నేతన్నలు ఆత్మహత్యలు చేసుకోవద్దని రాసిన రాతలను చూసి చలించిపోయానని…అందుకే స్వరాష్ట్రంలో నేతన్నల జీవితాల్లో వెలుగు నింపామన్నారు.
హెలికాప్టర్‌లో వస్తుంటే అప్పర్ మానేరు నుంచి సిరిసిల్ల వరకు ఒక సజీవ జలధారగా మారింది. సంతోసంగా ఉందన్నారు. సమైక్య రాష్ట్రంలో అప్పర్ మానేరు అడుగంటి పోయిందని కేసీఆర్ గుర్తు చేశారు. ఆ ప్రాజెక్టులోనే తెలంగాణ ఉద్యమ సభ జరిపిన పరిస్థితిని చూశాం అన్నారు.
ప్రాణం పోయినా సరే రాష్ట్రం రావాలి. వచ్చిన రాష్ట్రం సజీవ జలధారలతో కళకళలాడాలని కలలు కన్నాం. అప్పర్ మానేరు ఎండాకాలంలో కూడా మత్తడి దుంకుతుంటే సంతోషంగా ఉందని చెప్పారు. నేతన్నల జీవితాల్లో వెలుగు నింపడమే లక్ష్యమని చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని పథకాలను తీసుకొస్తామన్నారు.
Also Read:ఆస్తమా ఉందా..అయితే జాగ్రత్త!