మర్రి జనార్థన్‌ రెడ్డిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలి

287
cm kcr
- Advertisement -

నాగర్‌కర్నూల్‌ పట్టణాన్ని జిల్లా కేంద్రంగా చేసిన ఘనత తమ పార్టీకే దక్కుతుందన్నారు సీఎం కేసీఆర్‌. ఇవాళ నాగర్‌ కర్నూల్‌ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ నాగర్‌కర్నూల్ ప్రాంతంలో చాలా మంచి భూములున్నాయనినీళ్లు ఉంటే ఎంత బంగారపు పంటలు పండుతయని సీఎం కేసీఆర్‌ అన్నారు. మర్రి జనార్థన్‌రెడ్డి లక్ష్మీ పుత్రుడని, ఆయన ఎమ్మెల్యే అయినంకా కల్వకుర్తి కాల్వ నిండా నీళ్లు వచ్చినయన్నారు. ఇవాళ నాగర్‌ కర్నూల్‌ ప్రాంతంలో 70 వేల ఎకరాలు పారుతున్నదని, ఒకసారి వట్టెం పూర్తయిపోతే. నాగర్‌కర్నూల్ బంగారం అయిపోతది. రైతులు బాగుపడ్తరు. ఆ కల కంటున్నామని, మీ అందరి దయ ఉంటే..మీరు సర్కార్‌ను మళ్లీ గెలిపిస్తే..ఏడాదిన్నర లోపు వట్టెం మొత్తం పూర్తి చేసి..శ్రీశైలం నుంచి నింపి మీ పాదాలు కడుగుతామని మర్రి జనార్ధన్ రెడ్డిని మళ్లీ గెలిపించాలని సీఎం కేసీఆర్ ప్రజలను కోరారు.

CM-KCR

తాము కష్టపడి పనిచేసి 24 గంటల కరెంట్ ఇస్తున్నమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను కట్టానని చెప్పుకుంటున్న చంద్రబాబు..కరెంట్‌ను ఎక్కడ పెట్టాడో చెప్పాలని సీఎం ప్రశ్నించారు. సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ కోసం కృషి చేస్తున్నామని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రూ.1000 పెన్షన్ ఇస్తున్నారా..?అని ప్రశ్నించారు సీఎం కేసీఆర్‌. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం లక్ష నూట పదహార్లు ఇస్తున్నామని, తెలంగాణలో కరెంట్ లేదని ప్రధాని మోదీ అబద్దాలు చెప్తున్రు. ప్రధాని మోదీకి ప్రజలంతా బుద్ధి చెప్పాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. పార్టీలు, అభ్యర్థులు గెలవడం కాదు..ప్రజలు గెలివాలని, 58 ఏండ్లు పాలించిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ఒక వైపు, తెలంగాణ సాధించి..నాలుగేళ్ల పాలించిన టీఆర్‌ఎస్ పార్టీ ఒక వైపు ఉందని, ఎవరు ఏం చేశారో ఆలోచించి ఓటేయాలని సీఎం ప్రజలను కోరారు.

cm kcr nagarkarnool

ప్రపంచం మొత్తంలో రైతు బంధు స్కీం ఎక్కడైనా ఉందా..? రైతులను ఎవరైనా పట్టించుకున్రా?..దంచి వసూలు చేసిన్రు. భూములు పట్టా చేయిమంటే చేసిన్రా..? పైరవీలు చేయించిన్రు. కానీ మేం మీ భూరికార్డులు ప్రక్షాళన చేయించినం. 90 శాతం భూములు పరిష్కారం అయిపోయినయి. ఇంకా 10 శాతం ఉన్నయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత మిగిలిన భూముల సమస్యలను కూడా పరిష్కరిస్తాం. మీ ఊరికి వచ్చి రైతు బంధు చెక్కులను మర్రి జనార్థన్‌రెడ్డి మీ చేతుల్లో పెట్టిన్రు. మీ అందరికీ ఆ విషయం తెలుసు. అదే విధంగా దానికి మించిన పథకం రైతు బీమా. గుంట, పావు ఎకరం, ఒక్క ఎకరం భూమి ఉన్న రైతుగానీ చనిపోతే బీమా చేశాం. ఆ బీమా ద్వారా 5 లక్షల రూపాయలు వారి ఖాతాలో జమైపోతున్నాయి. ఇప్పటివరకు 3400 కుటుంబాలకు రైతు బీమా చెక్కులు అందినయి. వాళ్లు రెండు చేతులెత్తి దండం పెడ్తుతున్నదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

- Advertisement -