డిండి ప్రాజెక్టు పూర్తయితే దేవరకొండ నియోజకవర్గం దరిద్రం పోతదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఎందుకంటే ఈ ప్రాజెక్టు పాలమూరు ఎత్తిపోతలతో లింక్ ఉంటది కాబట్టి రాబోయే కొద్ది రోజుల్లో నీళ్లు వస్తాయని సీఎం తెలిపారు. దేవరకొండ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగించారు.
దేవరకొండ వెనుకబడిన ప్రాంతం కాబట్టి నాకు ప్రత్యేకమైన దృష్టి ఉందని సీఎం పేర్కొన్నారు. చక్కటి ఎమ్మెల్యే ఉన్నారు. రవీంద్ర నాయక్ బాధపెట్టే వ్యక్తి కాదు. చక్కటి నాయకుడు కాబట్టి డబుల్ మెజార్టీతో గెలిపించాలి. దేవరకొండ చరిత్రలో ఇదే పెద్ద మీటింగ్ అని అనుకుంటున్నాం. ఇంతకుముందు వచ్చిన కానీ ఇంత గొప్ప సమావేశం జరగలేదు. రవీందర్ కుమార్ 80 వేల మెజార్టీతో గెలిచిపోయిండు అని అర్థమవుతుందన్నారు.
Also Read:హార్రర్ థ్రిల్లర్.. ‘హి’