తెలంగాణ వచ్చాక ఒక్కో సమస్య పరిష్కరించుకున్నాం అన్నారు సీఎం కేసీఆర్. చొప్పదండిలో ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన సీఎం..చొప్పదండిలో లక్షా 25 వేల ఎకరాల భూమి సాగువుతోందన్నారు. కాంగ్రెస్ నేతలు 3 గంటల కరెంట్, రైతు బంధు దుబారా అంటున్నారని వారి వైఖరిని గమనించాలన్నారు. ధరణిని బంగాళాఖాతంలో కలపాలన్న కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలపాలన్నారు. కొండగట్టు క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు.
కాలువల కింద ఉచితంగా నీరు ఇస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు పేరుతో రైతులకు సాయం చేస్తున్నామని తెలిపారు. రైతు భీమా, ధాన్యం కొన్న డబ్బులు కూడా నేరుగా మీ అకౌంట్లలోనే పడుతున్నాయన్నారు. కాంగ్రెస్ వస్తే 3 గంటలకే కరెంట్ ఇస్తున్నామని చెబుతున్నారని వారికి బుద్ది చెప్పాలన్నారు. రైతు బంధు ఉండాలంటే బీఆర్ఎస్‌ను గెలిపించాలన్నారు. ధరణిని తీసేస్తే మళ్లీ దళారుల రాజ్యం వస్తుందన్నారు.
ఎన్నికలు వస్తుంటాయి..పోతుంటాయి కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలే గెలవాలన్నారు. అభ్యర్థితో పాటు ఆయన వెనకున్న పార్టీ విధానాన్ని చూడాలన్నారు. 50 ఏండ్లే పాలించిన కాంగ్రెస్ పార్టీ నేతలు మనీసం మంచి నీరు ఇవ్వలేకపోయారన్నారు. ఇవాళ ప్రతి ఇంటికి మంచినీరు వస్తున్నాయన్నారు.రాబోయే రోజుల్లో 24 గంటల నీళ్లు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నామని తెలిపారు.కాంగ్రెస్ పొరపాటున వస్తే పదేళ్ల కష్టం బూడిదలో పోసినట్లే అవుతుందన్నారు.అన్నివర్గాల క్షేమం కోరే ఏకైక పార్టీ బీఆర్ఎస్ అన్నారు. చొప్పదండికి ఎమ్మెల్యే రవిశంకర్ 100 పడకల ఆస్పత్రి మంజూరు చేయించారన్నారు.
Also Read:Mangalavaram:‘మంగళవారం’ పరిస్థితి ఏమిటి ?