CM KCR:అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సే

37
- Advertisement -

రాష్ట్రంలోనే అధికారంలోకి రాబోయేది బీఆర్ఎస్ సర్కారే అన్నారు సీఎం కేసీఆర్. మహేశ్వరం నియోజకవర్గం ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన సీఎం కేసీఆర్..ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దన్నారు. 75 ఏళ్ల స్వతంత్ర్య భారతదేశంలో రావాల్సినంత పరిణతి రాలేదని…ప్రజాస్వామ్యంలో ప్రజలే గెలవాలన్నారు. తెలంగాణ వచ్చాక సంక్షేమం, అభివృద్ధి రెండు జోడెడ్లలాగా పరుగులు పెట్టించామన్నారు.

కాంగ్రెస్ పాలనలో రూ.200 పెన్షన్ ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో దానిని రూ.2 వేలకు పెంచామన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చాక దానిని రూ.5 వేలకు తీసుకుపోతామన్నారు. రైతు బంధు దుబారా అని కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని…మహేశ్వరం నుండి సబితా ఇంద్రారెడ్డి గెలిస్తే రైతు బంధును రూ.16 వేలకు తీసుకుపోతామన్నారు.

రైతులకు 24 గంటల కరెంట్ వేస్ట్ అని పీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతున్నారని…అలాంటి వారికి బుద్ది చెప్పాలన్నారు. ధరణిని రద్దు చేసి భూమాతను తీసుకువస్తామంటున్నారని…అది భూమాత కాదు భూమేత అన్నారు.ధరణిని బంద్ చేస్తే రైతు బంధు ఎలా వస్తుందో కాంగ్రెస్ నేతలు చెప్పాలన్నారు. కాంగ్రెస్ వస్తే దళారుల రాజ్యం రావడం ఖాయమన్నారు. ఓటు అనేది ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం అని అది ప్రజల తలరాతను మారుస్తుందన్నారు. మహేశ్వరం నుండి సబితా ఇంద్రారెడ్డి గెలవాలని ఆమె గెలిస్తే మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. వందశాతం అధికారంలోకి రాబోయేది బీఆర్ఎస్‌ సర్కారేనని స్పష్టం చేశారు.

Also Read:మరి సినిమాల్లో బూతు సంగతేంటి?

- Advertisement -